రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లను కలవరపెడుతోంది ఒకటే విషయం

Written By Aravind Peesapati | Updated: August 12, 2019 14:13 IST
రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లను కలవరపెడుతోంది ఒకటే విషయం

రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లను కలవరపెడుతోంది ఒకటే విషయం
 
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జగన్ కి కెసిఆర్ కి తమ తమ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం లో కలవరం మొదలైనట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో వినబడుతున్న టాక్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో స‌హ‌జంగా పార్టీ నేత‌లు నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ‌తో ఉంటారు. అయితే, ఈ ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలో జగన్ ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకున్నార‌ని స‌మాచారం. అక్టోబర్ 15 తర్వాత ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల్లో ప్రతిభ చూపించిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేస్తున్నారు? ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా? సమస్యలను పరిష్కరిస్తున్నారా? లేదా అనేది సర్వే చేసి.. వారికి నామినేటెడ్ పదవులను ఇవ్వబోతున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ఇదేవిధంగా వ్యవహరించడంతో జగన్ కూడా కేసీఆర్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నామినేటెడ్ పదవుల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Top