బిజెపి పార్టీ గురించి ఒకరిపై ఒకరు విమర్శించుకొన్నా జమ్మూకాశ్మీర్ రాజకీయ నేతలు…!
ఇటీవల ఆర్టికల్ 370 పార్లమెంటులో రద్దు చేయడంతో బిజెపి పార్టీకి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అయితే జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు బిజెపి పార్టీ పై విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఇద్దరు నేతలు ఇటీవల ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం నట్లు వార్తలు వినబడుతున్నాయి. జమ్ము-కశ్మీర్ లోకి బిజెపిని నువ్వు తెచ్చావు అంటే నువ్వు తెచ్చావు అని ఆరోపణలు చేసుకుంటున్నాయి. శ్రీనగర్‌లోని హరి నివా్‌సలో వీరిద్దరూ గృహ నిర్బంధంలో ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒమర్ అబ్దుల్లాను ఉంచితే.. మొదటి అంతస్తులో మెహబూబా ఉన్నారట. ‘‘జమ్మూ కశ్మీరులోకి బీజేపీ రావడానికి నువ్వే కారణమని ఒకరికొకరు ఆరోపించుకున్నారని సమాచారం. ఒక సందర్భంలో మెహబూబాపై ఒమర్ గట్టిగా అరిచారు. 2015, 2018ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఆమెతోపాటు ఆమె తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌ను ఒమర్ తప్పుబట్టారు అని అదికారులు చెబుతున్నారు. దాంతో, వాజపేయి హయాంలో బీజేపీతో మీ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా పొత్తు పెట్టుకున్నారని మెహబూబా గుర్తు చేశారట.ఈ విదంగా పరస్పరం విమర్శలు సాగిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కి బీజేపీ పార్టీని అనవసరంగా ఇన్వాల్వ్ చేశామని లబోదిబోమంటున్నారు అక్కడ స్థానిక నేతలు.