Advertisement

యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్…!

by Xappie Desk | August 13, 2019 14:12 IST
యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్…!

యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్…!

 
ఇటీవల పార్లమెంటులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విషం కక్కిన మాటలు మాట్లాడటం ఇటీవల మనం చూశాం. అయితే తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ భారత తో యుద్ధానికి కాలు దువ్వడానికి రెడీ అవుతున్నట్లు ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ తన యుద్ద విమానాలను లడక్ సరిహద్దులోకి తరలిస్తోందన్న వార్తలు వచ్చాయి. యుద్దం వస్తే పాకిస్తాన్ కే ఎక్కువ నష్టం అన్న సంగతి తెలిసినా ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియాలి.‘‘పాక్‌ మూడు సీ-130 రవాణా విమానాల్లో స్కర్దు ఎయిర్‌ బేస్‌కు సామగ్రి చేరవేసింది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్‌ తన జేఎఫ్‌-17 యుద్ధ విమానాలను కూడా స్కర్దుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈద్‌ సందర్భంగా అట్టారీ-వాఘా సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎ్‌సఎఫ్‌, పాక్‌ రేంజర్లు స్వీట్లు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం ఈసారి నిర్వహించలేదు. ఆర్టికిల్ 370 రద్దుపై పాకిస్తాన్ ఈ విధంగా అతిగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ ఎంతో ధైర్యంగా తన సరిహద్దుల్లో యుద్ధ విమానాలను పెట్టడానికి చైనా దేశం కూడా కారణమని సమాచారం.


Advertisement


Advertisement


Top