దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం జగన్..!

Written By Xappie Desk | Updated: August 16, 2019 12:25 IST
దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం జగన్..!

దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం జగన్..!

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని చిత్తు చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే ప్రజలకు అవసరమయ్యే పథకాలు ప్రకటిస్తూ పరిపాలన చేస్తున్న ఏపీ సీఎం జగన్ కి దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా మూడో స్థానం లభించింది. వివరాల్లోకి వెళితే దేశ స్తాయిలో జరిగిన ఒక సర్వేలో ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో ఇటీవల వచ్చింది. అదికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆయన ప్రజాదరణ పొందగలగడం గమనించదగిన అంశమే. వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ‘దేశ్‌ కా మూడ్‌’ పేరిట చేపట్టిన సర్వేలో తేలినట్లు వీడీపీ అసోసియేట్స్‌ వెల్లడించింది. సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఈ సందర్భంగా తేల్చింది.ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రథమ స్థానంలో ఉండగా,యుపి సి.ఎమ్. యోగి ఆదిత్యనాద్ రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఐదో స్థానంలో నిలిచారు. అనుకున్నట్టుగానే జగన్ తాను చెప్పిన మాట అక్షరాల నెరవేర్చారు. ఎలా అంటే అప్పట్లో ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన తర్వాత మోడీ కూడా ప్రధానమంత్రి అయ్యాక ప్రమాణస్వీకారం చేయకముందు ఢిల్లీ పర్యటనలో మోడీ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చేత సంవత్సరం గడవక ముందే జగన్ ఒక మంచి ముఖ్యమంత్రి అని వాళ్ల చేత అనిపించు కొంటాను అని పేర్కొనడం జరిగింది. దీంతో జగన్ చెప్పినట్లు గానే ఏపీ ప్రజలు జగన్ మంచి ముఖ్యమంత్రి అని ఈ సర్వేలో తేల్చడం గమనార్హం.
Top