మద్యపాన నిషేధం పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్..?

Written By Xappie Desk | Updated: August 17, 2019 12:10 IST
మద్యపాన నిషేధం పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్..?

మద్యపాన నిషేధం పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్..?

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా మద్యపాన నిషేధం రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అని రాష్ట్రంలో ఉన్న అక్కాచెల్లెళ్లకు కంట్లో నీళ్లు తుడుస్తాను అని కుటుంబాలను నిలబెడతామని మద్యానికి ఎవరు బానిస అవ్వకుండా అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటానని అప్పట్లో పాదయాత్రలో ప్రజలకు జగన్ హామీ ఇవ్వడం జరిగింది. దీంతో అధికారంలోకి వచ్చాక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో ఉన్న బెల్టుషాపులు లేకుండా ఒక పక్క చర్యలు తీసుకుంటేనే మరోపక్క రాబోయే ఎన్నికల ప్రచారంలో పూర్తిగా మద్యపానం బెల్టు షాపులు లేకుండా కేవలం ఫైవ్ స్టార్ హోటల్ కి మాత్రమే పరిమితమయ్యే లా చర్యలు చేపట్టి అప్పుడు ఓట్లు అడుగుతా కి వస్తానని జగన్ చెప్పడం మనందరం విన్నాం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఉన్న బెల్టుషాపులను వెయ్యికి తగ్గించింది. అంతేకాకుండా ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి మద్యం దుకాణాలను నిర్వహించడానికి రెడీ అయింది. కాగా మండలాలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోనే షాపులను నిర్వహించాలని, ప్రతి 300 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఒక్కో మద్యం షాపు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతీ మద్యం దుకాణంలో సీసీ కెమెరాలు, తెలుగు, ఇంగ్లీషుల్లో నెంబర్ బోర్డులు వేయించడానికి సిద్దమయింది. కాగా ఈ షాపుల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకం చేపట్టనున్నారు. వారికి సంబందించిన విద్యార్హతతోనే వారికి ఈ మద్యం షాపుల్లో ఉపాధి కల్పించనున్నారు. అయితే ఎవరైనా కూడా ఈ విధానాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని ముందుగానే వైసీపీ ప్రభుత్వం హెచ్చరికలు జరీ చేస్తుంది.
Top