జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

Written By Xappie Desk | Updated: August 17, 2019 12:12 IST
జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

 
జనసేన పార్టీ అధ్యక్షుడు ఇటీవల మంగళగిరిలో కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అన్ని పార్టీల లాంటిది కాదు ఇది దేశాన్ని ప్రేమించే పార్టీ అని పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా గాని దేశ భావజాలంతో స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో పెట్టిన పార్టీ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి గ్రామంలో టిడిపి టిఆర్ఎస్ పార్టీల భావజాలాన్ని మాట్లాడుతూనే మరోపక్క జగన్ పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా పార్టీ కోసం కృషి చేసిన వారికి ఇన్చార్జిలు పదవులు అప్పగిస్తాం రాజకీయమంటే ఎలా బడితే అలా మాట్లాడటం కాదు అని అందరికీ భావోద్వేగాలు ఉంటాయి మనం మాట్లాడే మాటలు నియంత్రణతో ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ నోటికి వ‌చ్చింది మాట్లాడి సోష‌ల్ మీడియా అనే అద్భుత‌మైన వ్య‌వ‌స్థ‌ని దుర్వినియోగం చేయవద్దు అని సూచించారు. ఎవ‌రో కొద్ది మందిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అవేమీ న‌న్ను ఆప‌లేవు. ఎవ‌రికైనా అభిప్రాయాలు చెప్పే హ‌క్కు ఉంది. నేను నా స్వార్ధం కోసం పార్టీ పెట్ట‌లేదు. అట్ట‌డుగు స్థాయి నుంచిరాజ‌కీయాల్లో ఎద‌గ‌డానికి వ‌చ్చాను. దొడ్డి దారిన ఎద‌గ‌డానికి రాలేదు.తెలుగువారు ఎక్క‌డ ఉన్నా వారికి అండ‌గా ఉండాల‌న్న ఆలోచ‌న‌తో పెట్టాను.ఓటమిగానీ, ఇలాంటి విమ‌ర్శ‌లు గానీ న‌న్ను భ‌య‌పెట్ట‌లేవు. ప‌ని తీరు ఆధారంగా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాం. అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
Top