బాబు పీకలమీద వరకు వచ్చింది ! ఇంకేమి చేస్తాడు.. ఖాళీ చేయడమే..!
చంద్రబాబు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను చంద్రబాబు మాట సొంత పార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. మరోపక్క గతంలో అధికారంలో ఉన్న సమయంలో విచ్చలవిడిగా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కృష్ణానది తీరాన లింగమనేని నివాసంలో అక్రమంగా చంద్రబాబు ఉండటంతో తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం లింగమనేని గెస్ట్ హౌస్ విషయంలో చంద్రబాబుకి అనేక నోటీసులు ఇస్తూ ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కారణం నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కట్టకూడదని నిబంధన ఉన్నా గాని రూల్స్ ను అతిక్రమించి కట్టిన లింగమనేని భవనంలో చంద్రబాబు నివాసం ఉండటం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో భారీగా వర్షాలు పడిన క్రమంలో కృష్ణా నది ప్రవాహం మరింత పెరగడంతో బాబు నివాసంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నీట మునిగింది. దీంతో మరోసారి ప్రభుత్వం ఇల్లు ఖాళీ చేయాలంటూ.. బాబుకు నోటీ సులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు నిబంధనల వంకతో ఖాళీ చేసేందుకు ససేమిరా అన్న చంద్రబాబు ఇప్పు డు హెలీప్యాడ్ కూడా మునిగిపోవడం, ప్రబుత్వం మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఖాళీ చేయకత ప్పని పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. కృష్ణా నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున.. తక్షణమే ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చేందుకు ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. ఇప్పటికే 32 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీని పైన టీడీపీ నేతలు అధికారికంగా స్పందించలేదు. అయితే, ప్రస్తుతం ఆ నివాసంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. మరి ఏంజరుగుతుందో చూడాలి.