జగన్ పాలన గురించి కామెంట్ చేసిన ప్రభాస్..!

Written By Xappie Desk | Updated: August 18, 2019 18:13 IST
జగన్ పాలన గురించి కామెంట్ చేసిన ప్రభాస్..!

జగన్ పాలన గురించి కామెంట్ చేసిన ప్రభాస్..!

 
ప్రభాస్ నటించిన సాహో సినిమా త్వరలో విడుదల అవుతున్న క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఏపీ సీఎం జగన్ పరిపాలన ఎలా ఉంది అన్న ప్రశ్న ఎదురయ్యింది. ఈ క్రమంలో సమాధానం చెప్పడానికి కొంత గరుకుతనం చూపించిన ప్రభాస్...ప్రశ్నకు సమాధానమిస్తూ తనకు ఎక్కువగా పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియవని చెప్పాడు. అంతేకాకుండా జగన్ పరిపాలన ఇప్పుడే మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు బట్టి చూస్తుంటే చాలా బాగా పరిపాలిస్తున్న ట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా జగన్ మంచి యంగ్ సీఎం అని.. కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాగా పాలిస్తాడని ఆశించవచ్చని.. ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు ప్రభాస్. మొత్తానికి జగన్ గురించి ప్రభాస్ పాజిటివ్ కామెంటే చేశాడని చెప్పాలి. ప్రభాస్ నటించిన సాహో సినిమా ఆగష్టు చివరి వారంలో విడుదల కానుంది. భారీ బడ్జెట్ లో ప్రభాస్ కెరీర్ లోనే తెరచిన ఈ సినిమా నాలుగు ప్రధాన భాషల్లో విడుదల కావడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కూడా కచ్చితంగా బాహుబలి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.
Top