పాలిటిక్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి..!
తాను రాజకీయాలలోకి వెళ్లాక కొన్ని విషయాలలో నియంత్రణ కోల్పోయానని, తిరిగి సినిమాలలోకి వచ్చాక ఆహార నియమాలలో మార్పు చేసుకున్నానని ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి చెప్పారు. ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలపై మాట్లాడారు.ఇటీవల మీ ఫొటోషూట్‌తో సామాజిక మాధ్యమాల్లో మీ వయసు గురించి చర్చ జరిగింది గమనించారా? ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని, తగిన వ్యాయామం చేస్తూ ఉంటే.. వయసుని అధిగమించవచ్చు. వ్యాయామం నా దినచర్యలో ఓ భాగం. రాజకీయాల్లోకి వెళ్లాక ఎనిమిదేళ్లు నాపై నేను నియంత్రణ కోల్పోయా. ఎక్కడికంటే అక్కడికి వెళ్లడం, ఏదంటే అది తినడం, వెళ్లినచోట వ్యాయామం చేసుకొనే వెసులుబాటు లేకపోవడంతో కాస్త మారిపోయాను. ‘ఖైదీ నంబర్ 150’ మొదలవ్వగానే మళ్లీ మునుపటిలాగా నాపై నాకు నియంత్రణ వచ్చింది. ఈ మధ్య ఆహార నియమాల్లో మరిన్ని మార్పులు చేసుకొన్నా. విశాఖలో పెమా వెల్‌నెస్ సెంటర్‌కి వెళ్లొచ్చా. అక్కడ 20 రోజులపాటు డా.మూర్తి నేతృత్వంలో గడిపా. దాంతో మరింత బరువు తగ్గా. ఒక్కసారిగా ఆహారం, అలవాట్లపై నియంత్రణ అంటే సులభం కాదు కదా... నా అలవాట్లను వెంటనే మార్చుకోగలను. తినే తిండిలో ఇది లేకపోతే ఎలా? అని ఎప్పుడూ అనుకోను. అన్నం మానేయాలంటే మానేస్తా. సూప్స్, సలాడ్స్ మీదే ఉండాలన్నా ఉంటా. డైట్ విషయంలో చరణ్ సలహాలు ఇస్తుంటాడు. మొన్ననే యూరప్‌లో డిజైన్ చేసిన ఒక డైట్ గురించి చెప్పాడు. మూడు రోజుల్లో రెండు మూడు కిలోలు తగ్గించే నియమం అది.