చివరికి మోడీ చెంతకే బాబు..?

Advertisement

by Aravind Peesapati | August 18, 2019 18:15 IST
Follow Xappie
చివరికి మోడీ చెంతకే బాబు..?

చివరికి మోడీ చెంతకే బాబు..?

 
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని జగన్ చిత్తు చిత్తుగా ఓడించడం తో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబుకి కేంద్రంలో రెండోసారి బిజెపి ఇటు రాష్ట్రంలో వైసిపి పార్టీలు అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడంతో రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు మరొకసారి బీజేపీ చెంతకు దగ్గర అవటానికి దారులు వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా తాను నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వద్ద ఇటీవల డ్రోన్ కెమెరాలు ఉపయోగించి రెక్కీ నిర్వహించారని వచ్చిన వార్తలను ప్రతి చూపుతో చంద్రబాబు మోడీకి దగ్గరవడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. హైసెక్యూరిటీ జోన్ లో ఉన్న తన నివాసం చుట్టూ డ్రోన్ ను ఉపయోగించడంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఇదే విషయాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే శుక్రవారం సాయంత్రానికి ఈ వ్యవహారం పలు మలుపులు తిరగడంతో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం తనను నేరుగా ఎదుర్కోలేక వరద ముంపు పేరుతో డ్రోన్ లతో కుట్ర పన్నుతోందని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించి కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ జరిపించాలని కోరాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. మరి కేంద్రం చంద్రబాబుకు ఈ విషయంలో ఎంతవరకు అండగా ఉంటుందో చూడాలి.


Advertisement


Advertisement

Top