బీజేపీ నా మజాకా? తెలంగాణాలో పాగా వేసేశారుగా..?

Written By Aravind Peesapati | Updated: August 19, 2019 14:22 IST
బీజేపీ నా మజాకా? తెలంగాణాలో పాగా వేసేశారుగా..?

బీజేపీ నా మజాకా? తెలంగాణాలో పాగా వేసేశారుగా..?

 
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బిజెపి బంపర్ మెజారిటీతో గెలవడంతో దక్షిణాదిలో విస్తరించడానికి అదిరిపోయే స్ట్రాటజీ లతో దక్షిణాది రాజకీయ నేతలకు బిజెపి పార్టీ పెద్దలు భయాన్ని పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఒకపక్క బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరియు కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా ఆధీనంలో దక్షిణాది రాష్ట్రాలపై మాజీ కేంద్రమంత్రి బిజెపి పార్టీలో సౌమ్యుడు అనే పేరు ఉన్న జయప్రకాశ్ నద్దాను రంగంలోకి దింపాడు అమిత్ షా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో ఎలాగైనా ఈసారి బిజెపి పార్టీ పాగా వేయడానికి అదిరిపోయే స్కెచ్లు వేసింది. ఇందుమూలంగా ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బహిరంగ సభలో బిజెపి పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు వింటుంటే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం అనే వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ జేపీ నద్దా తనదైన శైలి పంచ్ డైలాగులు విసిరారు. కేసీఆర్ ను తాను వ్యక్తిగతంగా టార్గెట్ చేయనని అంటూనే... కేసీఆర్ తత్వమిదేనంటూ నద్దా సంచలన వ్యాఖ్య చేశారు. కుడిచేతితో ఇచ్చి ఎడమ చేతితో తీసుకునే రకం కేసీఆర్ అంటూ నద్దా నిజంగానే సంచలన కామెంట్ చేశారు. అంతేకాకుండా కేసీఆర్ సచివాలయం ముఖం చూడని వైనాన్ని కూడా ప్రస్తావించిన నద్దా... సచివాలయం ముఖం కూడా చూడకుండానే కేసీఆర్ దానిని కూలగొట్టేస్తానంటూ కదులుతుండటం తనకు ఆశ్యర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో లేకున్నా కూడా తెలంగాణకు ఎయిమ్స్ ను ప్రకటించిన ప్రభుత్వం మోదీ సర్కారేనని చెప్పిన నద్దా... తెలంగాణ అంటే బీజేపీకి ఎంతో గౌరవం మంటూ సభికులను ఆకట్టుకునే విధంగా నద్దా...మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు విని రాజకీయ విశ్లేషకులు త్వరలో తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు.
Top