కేసీఆర్ కడుపు రగిలిపొయిన వేళ.... ?

Written By Aravind Peesapati | Updated: August 19, 2019 14:23 IST
కేసీఆర్ కడుపు రగిలిపొయిన వేళ.... ?

కేసీఆర్ కడుపు రగిలిపొయిన వేళ....?

 
దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పనుల పై చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఉదాహరణకు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర రాజధాని అమరావతి విషయంలో చాలా చాలా చూపించేవారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ...ఆంధ్ర రాష్ట్ర రైతులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడే ఇదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాద్రాద్రి పునర్నిర్మాణంపై చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు గత కొంత కాలం నుండి జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో పనులు ఎలా జరుగుతున్నాయిఅన్న దానిపై ఇటీవల యాదాద్రి కేసీఆర్ సందర్శించిన ఈ క్రమంలో అక్కడ ఉన్న పరిస్థితులు చూసి పనులు చూసి కడుపు పగిలిపోయేలా కోపం తెచ్చుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో రాష్ట్రపతి ప్రధాని మోడీ అలాగే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమక్షంలో మహా సుదర్శన యాగం ఈ భారీ ఎత్తున నిర్వహించాలని కెసిఆర్ ప్లాన్ వేశారు. అయితే.. ఈ యాగం మొత్తం యాదాద్రి విస్తరణ పనుల మీదనే ఆధారపడి నడుస్తుంది. దీంతో.. యాదాద్రి పనులను సమీక్షించటానికి వచ్చిన కేసీఆర్.. అక్కడి గ్రౌండ్ పనుల్ని చూశాక నోట మాట రాలేదట.ఆర్నెల్ల క్రితం తాను వచ్చినప్పుడు ఏ పనులు ఉన్నాయో.. ఇప్పుడూ అదే పనులు నడుస్తున్నాయని.. ఇలా అయితే ఐదేళ్లకైనా పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందా? అని కెసిఆర్ కడుపు పగిలిపోయేలా ఆగ్రహంగా అధికారులపై నిప్పులు చెరిగారు అట. ఈ క్రమంలో పనులు ఇప్పటికైనా సరిగ్గా అవుతాయా లేకపోతే ఐదు సంవత్సరాలు పడుతుందా అని అధికారులను ఆగ్రహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఇటువంటి నేపథ్యంలో తర్వాత నాకు ఏం చేస్తారో తెలియదు మూడు నెలల్లో పనులు అయిపోవాలి అని అధికారులకు కేసీఆర్ సూచించారు.
Top