సీబీఐతో కాదు అమెరికా ప్రెసిడెంట్ తో విచారించుకోండి..!
కర్నాటకలో గతంలో ఒకసారి ఫోన్ టాపింగ్ వివాదం ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది.తాజాగా మరో పోన్ టాపింగ్ వివాదం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మెడపై వేలాడుతోంది.కర్నాటక ముఖ్యమంత్రి ఎడియూరప్ప పోన్ టాపింగ్ వివాదాన్ని విచారించడానికి సిబిఐకి లప్పగించారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాజపా నాయకులతో పాటు పలువురు పోలీసు అధికారులు, పాత్రికేయులు, సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్‌పాటిల్ అందించిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని యడియూరప్ప తెలిపారు.జేడీ(ఎస్) - కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ప్రస్తుత బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కరరావు కొందరు కాంగ్రెస్ జాతీయనేతలతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు వైరల్‌గా మారాయి. సుమారు 300 మంది పోన్ లు టాప్ అయ్యాయని చెబుతున్నారు.దీనిపై కుమారస్వామి స్పందిస్తూ, సీబీఐనే కాదు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో కూడా విచారణ చేయించినా నాకేమీ అభ్యంతరం లేదని అన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ ‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాదు.. ఆపరేషన్ కమలం పైనా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.