బీజేపీకి సరిగ్గా సమాధానం చెప్పిన మెగా బ్రదర్స్…?

Written By Aravind Peesapati | Updated: August 19, 2019 14:25 IST
బీజేపీకి సరిగ్గా సమాధానం చెప్పిన మెగా బ్రదర్స్…?

బీజేపీకి సరిగ్గా సమాధానం చెప్పిన మెగా బ్రదర్స్…?

 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ గాలి గట్టిగా వేస్తోంది. ఇటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో బిజెపి పార్టీ కొంత బలహీనంగా ఉన్న క్రమంలో ...దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బిజెపి బలమైన పార్టీగా తీర్చిదిద్దడానికి బిజెపి పార్టీ అధిష్టానం రెడీ అయింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల పై ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్న బిజెపి ఏపీలో సరైన నాయకత్వం లేని నేపథ్యంలో ప్రజా ఆకర్షణ కలిగిన నాయకులపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ వర్గంలో ఉన్న ప్రజాకర్షణ కలిగిన మెగా బ్రదర్స్ పై బిజెపి పార్టీ గురిపెట్టింది. ఇదే క్రమంలో ఇటీవల చిరంజీవి బిజెపి పార్టీలో చేరుతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా చిరంజీవి తాను మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలో ఒక ప్రముఖ పార్టీ తనను వారి పార్టీలోకి చేరమని కోరినట్లు ఆఫర్ ఇచ్చాయని కానీ నా దృష్టంతా సినిమాపైనే దృష్టి పెట్టానని పేర్కొనడం జరిగింది. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల తన పార్టీ సమీక్ష సమావేశంలో ఒక ప్రముఖ పార్టీ నుండి ఆఫర్ వచ్చిందని..జనసేన పార్టీని విలీనం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని పరోక్షంగా భాజపా ని టార్గెట్ చేసి సంచలన కామెంట్ చేయడం జరిగింది. కానీ తాను మాత్రం పార్టీని విలీనం చేసే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టి వారికి చెప్పడంతో వాళ్లు వెనక్కి తగ్గినట్లు...పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మొత్తం మీద దక్షిణాదిలో విస్తరించాలని చూస్తున్న బిజెపి పార్టీకి మెగా బ్రదర్స్ ఇద్దరు సరైన సమాధానం ఇవ్వక పోవడం ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు జాతీయ రాజకీయాల్లోనూ పెద్ద హాట్ టాపిక్ అయింది.
Top