మరో పథకానికి వైఎస్ పేరు పెడుతున్న జగన్..!

మరో పథకానికి వైఎస్ పేరు పెడుతున్న జగన్..!

మరో పథకానికి వైఎస్ పేరు పెడుతున్న జగన్..!

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనలో తన మార్క్ ఉండేలా నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో ఇటీవల పరిపాలన బాగా చేసే ముఖ్యమంత్రులలో రెండు నెలలకే మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు జగన్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయట పెడుతూ మరో పక్క తనకు భారీ మెజారిటీ ఇచ్చిన ఏపీ ప్రజలకు అవినీతి లేని పరిపాలన అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ఇటీవలె గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల గురించి స్వాతంత్ర వేడుకల్లో ప్రస్తావించిన జగన్...ఈ గ్రామ వాలంటీర్ల వల్ల ప్రజలు ప్రభుత్వం తో డైరెక్ట్ కావచ్చని...మధ్యలో ప్రజాప్రతినిధులతో ఎవరితో పని ఉండదని అంత గ్రామ వాలెంటర్ల్లు చూసుకుంటారని చెప్పుకొచ్చారు జగన్. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రకటించిన పథకాలు తన పేరే పెట్టుకున్నారు. కొన్ని కొన్ని పథకాలకు మాత్రం టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా జగన్ ప్రభుత్వం వాటిని మార్చే పనిలో అర్ధం అయ్యింది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును పలు పథకాలకు పెట్టాలనే ఆలోచనలో భాగంగా తాజాగా ఒక కొత్త పథకానికి వైయస్ పేరు పెట్టారు. అదే వైయస్సార్ పెళ్లి కానుక. గతంలో ఈ పథకానికి చంద్రన్న పెళ్లి కానుక అనే పేరు ఉండేది..అయితే పేరును మారుస్తూ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెళ్లి కానుక అనే పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అంతేకాకుండా ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరును వైఎస్సార్‌ పింఛను కానుకగా, మధ్యాహ్న భోజన పథకం పేరును వైఎస్సార్‌ అక్షయపాత్రగా మార్చారు.Top