నాన్ బెయిలబుల్ కేసు కే.ఏ పాల్ పై నమోదయ్యింది..!

Written By Aravind Peesapati | Updated: August 20, 2019 13:15 IST
నాన్ బెయిలబుల్ కేసు కే.ఏ పాల్ పై నమోదయ్యింది..!

నాన్ బెయిలబుల్ కేసు కే.ఏ పాల్ పై నమోదయ్యింది..!

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మైకుల ముందు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని అలాగే జగన్ ని మరియు పవన్ కళ్యాణ్ ని ఏకిపారేశారు. రాబోయేది తమ ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా చేస్తానని పాల్ పేర్కొనడం జరిగింది. తీరా జరిగిన ఎన్నికలలో ప్రపంచ శాంతి పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. ఇటువంటి నేపథ్యంలో తనకు ప్రపంచ నాయకులు బాగా తెలుసు అధ్యక్షులు నేను వెళ్తే నిలబడతారు అని గొప్పలు చెప్పుకునే పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిన కేఏ పాల్ హాజరు కాలేదు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన వారంతా హాజరయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన మహబూబ్ నగర్ న్యాయస్థానం కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో ఈ విషయంలో ఇప్పుడూ సంచలనం అయ్యింది.
Top