ఔటర్ రింగ్ రోడ్డులో యాక్సిడెంట్ వార్తలపై స్పందించిన హీరో తరుణ్..!

Written By Aravind Peesapati | Updated: August 20, 2019 13:17 IST
ఔటర్ రింగ్ రోడ్డులో యాక్సిడెంట్ వార్తలపై స్పందించిన హీరో తరుణ్..!

ఔటర్ రింగ్ రోడ్డులో యాక్సిడెంట్ వార్తలపై స్పందించిన హీరో తరుణ్..!

 
ఇటీవల హీరో తరుణ్ కి ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినపడ్డాయి. తరుణ్ ప్రయాణిస్తున్న కారు అవుటర్ రింగ్ రోడ్డు నార్సింగి పరిధిలోని అల్కాపూర్‌‌లో డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడింది అని ఈ ప్రమాదంలో తరుణ్ కి గాయాలు అయ్యాయి అని వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా కూడా తరుణ్ కార్ యాక్సిడెంట్ అయినట్లు వార్తలు ప్రసారం చేశాయి. అంతేకాకుండా కారు ప్రమాదం జరిగిన తర్వాత హీరో తరుణ్ మరొక కారులో వెళ్లినట్లు కూడా టెలికాస్ట్ చేశాయి. అయితే వచ్చిన వార్తల్లో నిజం లేదని తాజాగా త్వరలో అధికారికంగా వెల్లడించారు. యాక్సిడెంట్ వార్త అంతా అవాస్తవమని యాక్సిడెంట్ అయినా కారు కి తనకు ఎటువంటి సంబంధం లేదని రాత్రి నుండి ఇంటి వద్దే ఉన్నానని తన కారు కూడా క్షేమంగానే ఉందని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో సినిమా విషయాల గురించి ప్రస్తావిస్తూ….గత సంవత్సరం 'ఇది నా లవ్ స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ క్రమంలో నెక్స్ట్ సినిమా చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆ పనుల్లో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు తరుణ్.
Top