జగన్ అమెరికా వెళ్లడం పై విమర్శలు చేసిన లోకేష్..!

జగన్ అమెరికా వెళ్లడం పై విమర్శలు చేసిన లోకేష్..!

జగన్ అమెరికా వెళ్లడం పై విమర్శలు చేసిన లోకేష్..!

 
ఇటీవల ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఎన్నారైలు నుద్దేశించి జగన్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తూ జగన్ ఇచ్చిన సూచనలు కూడా చాలా హైలైట్ అయ్యాయి. దీనికోసం ప్రభుత్వం కూడా అన్ని విధాల సహకరిస్తుందని పేర్కొనడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటన పై మంత్రి నారా లోకేష్ టాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికాలో తన సొంత పనులకు జగన్ పర్యటిస్తారని బిజీగా ఉన్నారని విమర్శల వర్షం కురిపించారు. దేశంలో అంతటా వరదలతో కష్టాలు నష్టాలు వస్తుంటే దేశంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాదితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ బిజీగా ఉన్నారని ఆయన అన్నారు. ‘‘నోటి పారుదల మంత్రిగారు నోరు తెరిస్తే అబద్ధాలు. మొన్న తప్పుడు లెక్కలతో తడబడ్డారు. ఇప్పుడు విషయంపై అవగాహన లేక, నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బొక్కబోర్లా పడ్డారు’’ అని ఇంకో ట్వీట్ లో పేర్కొన్నారు.Top