జగన్ వ్యవహారంపై మండిపడుతున్న కేంద్రం..?

జగన్ వ్యవహారంపై మండిపడుతున్న కేంద్రం..?

జగన్ వ్యవహారంపై మండిపడుతున్న కేంద్రం..?

 
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పై గట్టిగా దృష్టి పెట్టిన జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతి అక్రమాలు కూడా బయటపెడుతూనే ఈ క్రమంలో జగన్ ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య చిచ్చు రేగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఘోరమైనది అని ముఖ్యంగా పీపీఏల ఒప్పందం విషయంలో కేంద్రానికి జగన్ లేఖ రాయటం ఇప్పుడు కేంద్రంలో పెద్ద సంచలనమైంది. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారని ఆగిపోతాయని ఇలాంటి పనులు చేయవద్దని జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇటువంటి క్రమంలో జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను నవయుగ కంపెనీకి అప్పజెప్పిన ఒప్పందాన్ని రద్దు చేసి తాజాగా రీటెండరింగ్ కు వెళ్ళింది. కాగా ఈ విషయమై పోలవరం అథారిటీకి కేంద్రం లేఖ రాయగా, కొన్ని మనస్పర్థల కారణంగా వారిరువురి మధ్యన ఉన్నటువంటి సంబంధాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయని అందరు కూడా అంటున్నారు. జగన్ ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదని, అసలు జగన్ కి సరైన రీతిలో బుద్ది చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం.అంతేకాకుండా జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తం బయటకు తీయడం పట్ల కేంద్ర ప్రభుత్వం మండిపడుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయాలకు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మండిపడుతున్నట్లు సమాచారం.Top