ప్రశ్నించడానికి పార్టీ పెడతానని అధికారం కోసం కాదు అంటూ 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి చాలా కష్టపడి పని చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఈ నాలుగు సంవత్సరాలు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందుతున్న క్రమంలో.. చంద్రబాబు ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ...వ్యతిరేక ఓటును జగన్ వైపు మళ్లకుండా తెలివిగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుని ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అయిన పవన్ కళ్యాణ్.
తాజాగా ఎన్నికలు వస్తున్న క్రమంలో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జగన్ వైపు గాలి వేస్తున్న నేపథ్యంలో.. గత ఏడాది మార్చి నెలలో అధికారికంగా గుంటూరు వేదికగా చంద్రబాబు ని విభేదించిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుత ఎన్నికలకు చీకటిలో బాబుతో డీల్ సెట్ చేసుకున్నట్లు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసిపి పార్టీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేత లింగమనేని వారిద్దరికి మధ్యవర్తిత్వం వహించారని, టీడీపీకి పరోక్షంగా సహకరించేందుకు పవన్ కళ్యాణ్ వెయ్యి కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం ఉందని ఆయనారోపించారు. ప్రశ్నిస్తానని రాజకీయాలలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ పని మానేసి ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారని, టిడిపి ఇచ్చిన హామీలపై ప్రశ్నించే బాద్యత పవన్ కళ్యాణ్ కు లేదా అని ఆయన అన్నారు. జనసేన ప్రజారాజ్యం-2గా మారటం ఖాయమన్నారు.