జగన్ కి 1000 కోట్లు అన్న కామెంట్లపై క్లారిటీ ఇచ్చిన కేటిఆర్..!

Written By Xappie Desk | Updated: March 28, 2019 12:51 IST
జగన్ కి 1000 కోట్లు అన్న కామెంట్లపై క్లారిటీ ఇచ్చిన కేటిఆర్..!

జగన్ కి 1000 కోట్లు అన్న కామెంట్లపై క్లారిటీ ఇచ్చిన కేటిఆర్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ టిఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారని..ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విపరీతమైన కామెంట్లు చేసిన నేపథ్యంలో..వారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రమంలో..చంద్రబాబు పవన్ కళ్యాణ్ టిఆర్ఎస్ పార్టీ గురించి మరియు జగన్ తో కేసీఆర్ కుమ్మక్కు అన్న వ్యాఖ్యలపై సంచలన జవాబు ఇచ్చారు.
 
ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీ కి 1000 కోట్లు ఇచ్చారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ….కేటీఆర్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఇక్క‌డ‌కొచ్చి ప్ర‌చారం చేశారు. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో టీడీపీ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. దాంతో చంద్ర‌బాబుకు మైండ్ బ్లాంక్ అవ‌డంతో ప్ర‌స్తుత ప‌రిస్థితులు అర్ధంకాకుండా పోయాయ‌న్నారు. తెలంగాణ‌లో టీడీపీకి ప‌ట్టిన‌గ‌తే.. ఏపీలోనూ ఎదురు కానుంద‌ని, ఆ విషయాన్ని త‌న 40 ఏళ్ల అనుభ‌వంతో ముందుగా గ్ర‌హించిన చంద్ర‌బాబు మ‌తిస్థిమితం కోల్పోయి తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉండి చేసిన ఆరోప‌ణ‌లే జ‌గ‌న్‌కు తాము వెయ్యి కోట్లు పంపించామ‌ని అంటూ కేటీఆర్ ఎద్దేవ చేశారు.
Top