జగన్ ని ఏమైనా అంటే తాటతీస్తా అంటున్న 30 ఇయర్స్ పృథ్వి..!

Written By Xappie Desk | Updated: August 16, 2019 12:26 IST
జగన్ ని ఏమైనా అంటే తాటతీస్తా అంటున్న 30 ఇయర్స్ పృథ్వి..!

జగన్ ని ఏమైనా అంటే తాటతీస్తా అంటున్న 30 ఇయర్స్ పృథ్వి..!

 
వైసీపీ అధినేత జగన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మద్దతు చాలా తక్కువ. ఎక్కువగా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది తెలుగుదేశం పార్టీ కి చంద్రబాబు కి కొమ్ము కాయడం అందరికీ తెలిసిన విషయమే..ఇటువంటి తరుణంలో జగన్ కి ముందు నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ రచయిత పోసాని కృష్ణ మురళి కమెడియన్ పృథ్వి అలాగే మిగతా కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారు మద్దతు తెలుపుతున్నారు. కమెడియన్ పృథ్వి అయితే జగన్ పాదయాత్ర నుండి సపోర్ట్ చేస్తూనే ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ వైపు బలంగా నిలబడ్డారు. ఇటువంటి తరుణంలో ఎన్నికలు గెలిచిన తర్వాత తనకు అండగా ఉన్న పృథ్వి కి జగన్ ఒక నామినేటెడ్ పదవి ని అప్పగించడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఎన్నికల అయిపోయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. అప్పట్లో పృద్వి మాట్లాడుతూ సినీ పరిశ్రమకి సంబందించిన ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపితే బాగుండు అని తన అభిప్రాయం తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వెంటనే కలవాలనే రూల్ ఏమన్నా ఉందా ..? అంటూ వెటకారంగా మాట్లాడటం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న పృథ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పృథ్వీ ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టగానే తనకు సన్మానాలు చేస్తారని, కానీ జగన్ అధికారాన్ని చేపడితే ఇలా విమర్శలు చేయడం సరికాదని పృథ్వీ అన్నారు. ఇకపోతే ఇకనుండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అంటే ఒక్కొక్కరి తాట తీస్తా అని పృథ్వీ హెచ్చరించారు.
Top