చంద్రబాబు ని మించిన జగన్ యూ టర్న్ లు - CM కాకముందే అతిపెద్ద బాంబు పేల్చాడు !!

Written By Anoop Sai Bandi | Updated: May 26, 2019 20:46 IST
చంద్రబాబు ని మించిన జగన్ యూ టర్న్ లు - CM కాకముందే అతిపెద్ద బాంబు పేల్చాడు !!

రాష్ట్ర రాజకీయం లో జగన్ మోహన్ రెడ్డి తనదైన మార్క్ పాలిటిక్స్ కి తెర లేపారు . నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు .. మూడున్నర దశాబ్దాల అతిపెద్ద పార్టీ తెలుగుదేశం రెండూ జగన్ దెబ్బకి ఎగ్గిరిపోయాయి. ఉమ్మ ఆంధ్ర ప్రదేశ్ , విభజిత ఆంధ్ర ప్రదేశ్ ల చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పరాజయం మూటగట్టుకునేలా చేశాడు జగన్. రాజకీయం అంటే ఈ రేంజ్ లో ఉంటుందా అనిపించే విధంగా పోలిటికల్ అస్త్రాలతో చంద్రబాబు ని మట్టి కరిపించాడు. అయితే ప్రస్తుత తరుణం లో ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి ముందరే జగన్ మోహన్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది. మొదటిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయం లో తాను చేయగలిగింది ఏమీ లేదు అనీ బీజేపీ కి సొంతగా గొప్ప మెజారిటీ ఉండడం తో వాళ్ళు మన మాట వినే పరిస్తితి లో లేరు అంటూ తేల్చేసిన జగన్ - పోరాడటం తప్ప చేసేది ఏదీ లేదు అంటూ తేల్చి పదేశాడు. పోలవరం విషయం లో కూడా జగన్ బాంబు పేల్చాడు .. పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ అసలు దాంట్లో తలదూర్చే ప్రసక్తే లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలననానికి దారి తీసాయి. లిక్కర్ బ్యాన్ విషయం లో జగన్ కొత్త ఒరవడి తీసుకుని వచ్చాడు. విభిన్న దశలలో మద్య్యపాన నిషేధం తీసుకోస్తాం అనీ అయితే ఫైవ్ స్టార్ హోటేల్స్ లో మాత్రం మందు దొరుకుతుంది అని చెప్పుకొచ్చాడు ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి. ఆంధ్ర ప్రదేశ్ గత ప్రభుత్వం వల్ల కావచ్చు ఇతరత్రా కారణాల వలన కావచ్చు దాదాపు రెండున్నర లక్షల కోట్ల అప్పులలో రాష్ట్ర మునిగిపోయి ఉంది అంటూ జగన్ అతిపెద్ద సంచలన విషయం బయట పెట్టాడు. జగన్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలా అంటుంటే CM ఐన తరవాత పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ వాపోతున్నారు జనాలు.
Top