త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏపీ లో ఉన్న రాజకీయ ఒక చిత్రాన్ని గమనిస్తే వైసిపి మరియు టిడిపి పార్టీ ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా జగన్ మరియు చంద్రబాబుల మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది. దీంతో ఎన్నికల మరికొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి ద్రుష్టి కూడా పొలిటికల్ సర్వేలపై పడ్డాయి. ఇందులో భాగంగా ఇండియా టుడే ఛానల్ నిర్వహించిన సర్వేలో వైసీపీకి అధికారం రావడానికి ఎక్కువ అవకాశం ఉందని తేల్చేశాయి కూడా… రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, జగన్ ముఖ్యమంత్రి కానున్నారని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండబోతారని అంతేకాకుండా జనసేన పార్టీ కొన్ని సీట్లకే పరిమితమవుతుంది తేల్చేశాయి… దీంతో అందరుకూడా ఆలోచనల్లో పడ్డారు… ఏపీ ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారని ‘యాక్సెస్ మై ఇండియా’ ద్వారా ప్రశ్నించగా 45 శాతం మంది జగన్ వైపు మొగ్గు చూపారు. 36 శాతం మంది చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. జాతీయ సంస్థలు చేస్తున్న సర్వేలు జనసేనను పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. కానీ పవన్ ని కూడా పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా కనబడుతుందని, అందుకనే పవన్ కి అధికారం రాదు అని అంటున్నారు. ఎందుకంటే అనుకున్నంత రీతిలో పవన్ ప్రజల్లో కలవలేకపోతున్నాడని సమాచారం. తాజాగా ఈ సర్వే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ శ్రేణులు సంతోషంతో ఉన్నారు.