120 స్థానాలను టార్గెట్ చేసిన జగన్..!

Written By Xappie Desk | Updated: January 29, 2019 12:08 IST
120 స్థానాలను టార్గెట్ చేసిన జగన్..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర తో పార్టీ గ్రాఫ్ అమాంతం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచేశారు. తాను కష్టపడి ప్రజల కోసం పోరాడుతూ వేసిన ప్రతి అడుగుకి ప్రజల నుండి నమ్మకాన్ని పొందుకొని ఆంధ్ర రాజకీయాలలో తన తండ్రి వైయస్ మాదిరిగానే సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ కచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ముఖ్యమంత్రి అవడం తధ్యమని ఫలితాలు రావడంతో భవిష్యత్తు రాజకీయాలు రాణించాలని చూస్తున్న చాలా మంది ప్రముఖులు మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైసిపి పార్టీ కండువా కప్పుకుంటున్నారు.
 
ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా వైసిపి పార్టీకి 120 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైసిపి పార్టీలు నాయకులు గుసగుసలాడుతున్నారు. ముఖ్యంగా జగన్ కు అత్యంత బలమైనటువంటి సీమ ప్రాంతాలు అయినటువంటి అనంతపూర్, కడప కర్నూలలో వైసీపీ కి తిరుగు ఉండదని అక్కడ 95 % వరకు గెలుస్తుందని చెప్తున్నారు. చిత్తూర్ లో 70% అలాగే ఇక కోస్తాంధ్ర కి వచ్చినట్టయితే శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు ప్రతీ నియోజకవర్గాలలో 50-50 శాతం సీట్లు వస్తాయని అలాగే ఇక గోదావరి జిల్లాలో మాత్రం ఒక దగ్గర 70 శాతం మరో జిల్లాలో 60 శాతం సీట్లు వచ్చేందుకు అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎలా అయినా సరే 120 సీట్లు పక్కా అని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
Top