2014 ఎన్నికల సమయంలో జాతీయ చానల్ Polls లో ఇలాగే జరిగింది అంటున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాల గురించి సంచలన కామెంట్ చేశారు. ఇటీవల పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు..తనకి ప్రధాని పదవిపై ఆశలేదని సమావేశంలో వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలలో వినబడుతున్న టాక్. అంతేకాకుండా ప్రస్తుతం రాబోతున్న ఫలితాల గురించి చంద్రబాబు మాట్లాడుతూ కచ్చితంగా తెలుగుదేశం వందకి 100% గెలుస్తుందని నాయకులకు ధీమాగా తెలియజేశారట. ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎవరూ భయపడవద్దని నాయకులకు ధైర్యం కూడా చెప్పారట.
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకి తాను చేస్తున్న ప్రయత్నాలు, అక్కడ ఏ పదవీ ఆశించి చేయడం లేదని, ఈ విషయాన్ని పార్టీ నాయకులు వివిధ వేదికలపై మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పాలని ఆయన అన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పాత్రను, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా తాను నిర్వహిస్తున్నానన్నారు. ‘ 2014లో కొన్ని జాతీయ ఛానళ్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పాయని, కానీ తెదేపా ఘన విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారం కూడా కొన్ని ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పే అవకాశం ఉందని.. కానీ, 23న వెలువడే ఫలితాల్లో గెలుపు తెదేపాదేనని చంద్రబాబు చెప్పారట.