2019 ఎన్నికల్లో కీలకం కాబోతున్న పవన్..!

2019 ఎన్నికల్లో కీలకం కాబోతున్న పవన్..!

2019 ఎన్నికల్లో కీలకం కాబోతున్న పవన్..!
 
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణాలలో ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో చివరి వరకు అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని అందరూ భావించిన నేపథ్యంలో ఒక్కసారిగా జనసేన పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు. ఆ సమయంలో ఎన్నికలలో పోటీ చేయకుండా కేవలం టీడీపీకి మద్దతు తెలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి కారకుడయ్యారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గత నాలుగు సంవత్సరాలు అనేక ప్రజా సమస్యలపై పోరాడుతూ మరోపక్క సినిమాలలో ఉన్న పవన్ కళ్యాణ్ గత సంవత్సరం మార్చి నెల నుండి సినిమాలకు స్వస్తి చెప్పి తన పూర్తి జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసినట్లు మెరుగైన సమాజం నిర్మాణం కోసం పాలిటిక్స్ లో అడుగుపెట్టినట్లు ప్రకటించారు పవన్.
 
ప్రస్తుతం ఆంధ్రా లో టీడీపీ మరియు వైసీపీ పార్టీ లకు ధీటుగా తాను స్థాపించిన జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా సక్సెస్ అయ్యారు పవన్. అయితే మరి కొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ మరియు వైసీపీ పార్టీలు జనసేన తో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినపడుతున్న టాక్. ఇదే క్రమంలో ఇటీవల పార్టీ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ పొత్తు పెట్టుకోవడం కోసం తెలంగాణలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతల చేత తన వద్దకు వస్తున్నట్లు ఇటీవల పార్టీ సమావేశంలో నాయకులకు తెలియజేశారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలపై రాజకీయ పరిశీలకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పవన్ ఎఫెక్ట్ గట్టిగా ఉండబోతున్నట్లు పవన్ ఎవరికి మద్దతు తెలుపుతాడో వారికే ఎక్కువ విజయవకాశాలు ఉంటాయని అంటున్నారు.
 Top