2019లో నంద్యాలలో ఎగిరేది వైసిపి జెండాఏనా..?

Written By Xappie Desk | Updated: April 05, 2019 12:08 IST
2019లో నంద్యాలలో ఎగిరేది వైసిపి జెండాఏనా..?

2019లో నంద్యాలలో ఎగిరేది వైసిపి జెండాఏనా...?
 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అధికార పార్టీ తెలుగుదేశం మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీల మధ్య తీవ్ర ఆధిపత్యపోరు అసెంబ్లీలోని మరియు అనేక సందర్భాలలో నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ కి చెందిన భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో కి వెళ్ళాక కొన్ని అనివార్య కారణాలవల్ల అనారోగ్యం కారణంగా మరణించడంతో నంద్యాలలో ఉప ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నంద్యాలలో జగన్ గెలవాలని గట్టిగా ప్రయత్నాలు చేసిన అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నంద్యాలలో అభివృద్ధి పనులు అంటూ ఉప ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తేనే ఈ పనులు జరుగుతాయని ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం మరియు అదే విధంగా విచ్చలవిడిగా డబ్బులు పంచి పెట్టడం తో వైసిపి పార్టీ ఆ ఉప ఎన్నికలలో ఓడిపోయింది.
 
అయితే ఈ క్రమంలోనే పార్టీ ప్లీనరీ సమావేశం అని పార్టీ ఎక్కడా కూడా డౌన్ఫాల్ రాకుండా వెంటనే పాదయాత్ర ప్రకటన చేసి పార్టీ ప్లీనరీ సమావేశంలో నవరత్నాలను ప్రజలకు తెలియ చెప్పడం తో జగన్ ఒక రకంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి ఎక్కడైతే అనగా నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలలో డబ్బుతో అధికార బలంతో వైసిపి పార్టీని దెబ్బ కొట్టాలని చూసిన సమయంలోనే జగన్ తన పదునైన వ్యూహాలను పాదయాత్ర ద్వారా మొదలుపెట్టి చంద్రబాబు కి మతిపోయే విధంగా ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వాతావరణం చూస్తుంటే రాష్ట్రం మొత్తం వైసీపీ పార్టీ మెజార్టీ స్థానాలు గెలవడం ఖాయం అని ప్రతి సర్వేల ఫలితాలు వస్తున్న క్రమంలో ...ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల ప్రాంతంలో తాజాగా ప్రచారం నిర్వహించిన జగన్ కి అక్కడి ప్రాంత ప్రజలు ఇసుక వేస్తే రాలనంతగా బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా రోడ్డు విస్తరణ అంటూ భవనాలు కూల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఆ బాధితులకు కనీసం నష్టపరిహారం ఇవ్వలేదని జగన్ దగ్గర లబోదిబో అంటూ తమ బాధను తెలిపారు.
 
ఈ నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ ఒక నియోజకవర్గంలో కాబట్టి ఆ సమయంలో తన చేతిలో ఉన్న అధికారాన్ని మొత్తాన్ని ఉపయోగించుకొని గెలవగలిగాడు చంద్రబాబు...రాబోతున్న ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం చంద్రబాబు కి దిమ్మ తిరిగిపోయే విధంగా అబద్ధాలు చెప్పిన చంద్రబాబు కి బుద్ది చెప్పడానికి రెడీగా ఏపీ ప్రజలు ఉన్నారని రాబోయేది మన ప్రభుత్వం అని ప్రజలనుద్దేశించి ధైర్యం చెప్పారు జగన్. మొత్తంమీద చూసుకుంటే 2019 ఎన్నికల్లో నంద్యాలలో వైసీపీ పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది.
Top