2019 ఎన్నికల్లో గోదావరి రాజకీయ ముఖచిత్రం ఇలా ఉంది…!
2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ కి కనీస స్థానాలు కూడా దక్కలేదు ఈ రెండు జిల్లాలలో. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ రెండు జిల్లాలలో ఉండటంతో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు తెలిపారు ఒక్కసారిగా అప్పటి వరకూ అన్ని సర్వేలలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు అని రాజకీయ మేధావులు అంటున్నారు.
అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం స్వతంత్రంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పార్టీలు పోటీ చేస్తున్న నేపథ్యంలో జరగబోతున్న ఎన్నికల్లో గోదావరి జిల్లా ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ అయినా కేకే సర్వే ఇక్కడ సర్వే చేయించగా ఆసక్తి కరమైన ఫలితాలు బయటపడ్డాయి. మొత్తం గోదావరి జిల్లాలో 34 స్థానాలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలను కైవసం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోందని, అలాగే టీడీపీ 12 సీట్లపై పూర్తి పట్టు సాధించేందుకు ఇప్పటికే ప్రణాళికలు అమలు చేసిందని, ఇక జనసేన విషయానికొస్తే సామాజికవర్గం పరిణామాల నేపథ్యంలో ఏకంగా 27 స్థానాలపై కన్నేసిందని, టార్గెట్‌గా పెట్టుకున్న స్థానాలల్లో పాగా వేసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని కేకే సర్వే తేల్చింది.