2024 ఎన్నికలకు సంచలన సవాల్ విసిరిన జగన్..!

2024 ఎన్నికలకు సంచలన సవాల్ విసిరిన జగన్..!

2024 ఎన్నికలకు సంచలన సవాల్ విసిరిన జగన్..!
 
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఎన్నికల ప్రచారంలో సంచలన సవాల్ చేశారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చిన తర్వాత తాము ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టోలోని అంశాలను అమలు చేసిన తర్వాతే మళ్లీ ఓటు అడుగుతానని 2024 ఎన్నికల సమయంలో చెప్పండి చేశాకే మీ ముందుకు వస్తానని జగన్ పేర్కొన్నారు.మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని, వాటిని అమలు చేసిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడగుతామని చెప్పారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు 50 పేజీల మేనిఫెస్టోలో 650 హామీలిచ్చారని, ప్రతి కులానికి ఓ పేజీ కేటాయించి దారుణంగా మోసం చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు 34 పేజీలతో మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారని, ప్రజలు ఆలోచించాలని కోరారు. తాము ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో కేవలం ఒకే పేజని..రెండు వైపులు మాత్రమే ఉందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. నవరత్నాల్లో చెప్పిన మాటలు, ప్రతి పేదవాడి గుండె చప్పుడు మేనిఫెస్టోలో పెట్టామని స్పష్టం చేశారు. ఈ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి రోజు చూపిస్తామని, ఎవరూ మర్చిపోకుండా చేస్తామన్నారు. ప్రతి రోజు ఇది చెప్పాం.. ఇది చేశామని అందరికి చూపిస్తామని తెలిపారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వస్తామని, ఇందులో చెప్పిన ప్రతి మాటను చేశామని. మళ్లీ మమ్మల్ని గెలిపించండని అడుగుతామన్నారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని , ప్రతి రాజకీయ నాయకుడు తాను చెప్పిన పనిని చేయకపోతే.. రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని అన్నారు. అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తోందని జగన్ పేర్కొన్నారు.Top