రెండు సీజన్ ల కంటే ఈ సారి బిగ్ బాస్ సీజన్ చాలా డిఫరెంట్ .. కారణం ఇదే !
తాజాగా ప్రారంభమైన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 అదరగొట్టేసింది. ముందు నుండి ఈ షో కి అద్భుతమైన ఆదరణ టెలివిజన్ ప్రేక్షకుల నుండి వస్తోంది. దానికి కారణం హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అని అంటున్నారు చాలామంది. గత రెండు సీజన్ లతో పోలిస్తే సీజన్ 3 లో ఉన్న సభ్యులు అందరికీ తెలిసిన మొహాలు అయిన నేపథ్యంలో సీజన్ 3 ని ఆశక్తిగా వీక్షిస్తున్నారు టీవీ ప్రేక్షకులు.
ముఖ్యంగా ఈ సీజన్‌లో సెలబ్రెటీ కపుల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇండియాలో పలు భాషల్లో బిగ్‌బాస్ సాగుతుంది. కాని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సెలబ్రెటీ కపుల్ వెళ్లలేదు. మొదటి సారి వరుణ్ సందేష్ మరియు వితిక షేరులు వెళ్లడం జరిగింది. దీంతో వీరిద్దరి స్పెషల్ అట్రాక్షన్ గా షో కి నిలవడం తో టెలివిజన్ ప్రేక్షకులు మరియు సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు సీజన్ 3 ని మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా సీజన్ 3 లో షో నిర్వాహకులు బుల్లి తెర మరియు వెండి తెరతో పాటు సోషల్ మీడియా సెన్షేషన్స్‌ను కూడా రంగంలోకి దించడంతో ఈ షోపై అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మొత్తం మీద గత రెండు సీజన్ల కంటే సీజన్ 3 చాలా డిఫరెంట్ గా ఉందని అంటున్నారు.