Advertisement

ఈ బిగ్ బాస్ ప్రోమో చూస్తే నాగార్జున కూడా వామ్మో అంటాడు !

by Aravind Peesapati | July 23, 2019 19:32 IST
ఈ బిగ్ బాస్ ప్రోమో చూస్తే నాగార్జున కూడా వామ్మో అంటాడు !

ఈ బిగ్ బాస్ ప్రోమో చూస్తే నాగార్జున కూడా వామ్మో అంటాడు !
 
ఇప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఎక్కువ ఆదరణ పొందుతోంది. ఎక్కడ చూసినా బిగ్‌బాస్‌ సీజన్‌ 3 గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా లో కానీ..ఎలక్ట్రానిక్ మీడియాలో గాని బిగ్‌బాస్‌ సీజన్‌ 3 షో పెద్ద వైరల్ గా మారింది. ఇటువంటి క్రమంలో ఈ షో కి పోటి గా డిగ్ బాస్ 3.0 అనే వెరైటీ ప్రొగ్రామ్ లేటెస్ట్ గా తెరపైకి వచ్చింది. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో పెద్ద వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం కి యాంకర్ గా కూడా యాస్ ఇట్ ఈస్ డిటో నాగార్జున లాగ వున్న ఒక వ్యక్తి చేత ప్రోమో చేపించి ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో విడుదల చేయడంతో పెద్దగా వైరల్ గా మారి బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ని ఇమిటెడ్ చేసినట్లుగా ఉంది.
 
అంతేకాదు ఈ ప్రోమో వీడియో లో టాలీవుడ్ సెలబ్రిటీలను పోలిన వాళ్ళను పార్టిసిపెంట్స్ గా దించేశారు. విజయ్ దేవరకొండ - శ్రీముఖి - ప్రభాస్ - కేఏపాల్ - రాజ్ తరుణ్ - రేణు దేశాయ్ - పోసాని - సునీల్ లాంటి సెలెబ్రిటీల పోలికలు బాడీ మ్యానరిజమ్స్ ఉన్న వాళ్ళతో పాటు టిక్ టాక్ లో పాపులర్ అయిన ఉప్పల్ బాలుని కూడా ఇందులో తీసుకొచ్చారు. మొత్తం మీద ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు... బిగ్ బాస్ ప్రోమో చూస్తే నాగార్జున కూడా వామ్మో అంటారు అని కామెంట్ చేస్తున్నారు.


Advertisement


Advertisement


Top