హమ్మయ్య తమన్నా బయటికి వెళ్లిపోయింది అంటున్నారు…!

Written By Aravind Peesapati | Updated: August 12, 2019 14:15 IST
హమ్మయ్య తమన్నా బయటికి వెళ్లిపోయింది అంటున్నారు…!

హమ్మయ్య తమన్నా బయటికి వెళ్లిపోయింది అంటున్నారు…!
 
బిగ్ బాస్ హౌస్ లో మొట్టమొదటి ఎలిమినేషన్ కార్యక్రమంలో ఎలిమినేట్ అయిన హేమ ప్లేసులో వైల్డ్ కార్డు రూపంలో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హౌస్ లో ఎంట్రీ ఇవ్వక ముందు యాంకర్ నాగార్జున పక్కన నుంచుని తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు ఏం ప్లానింగ్ లేకుండా ప్యూర్ గా స్వచ్ఛంగా బిగ్ బాస్ హౌస్ లో వ్యవహరిస్తానని చెప్పడం జరిగింది. అయితే హౌస్ లోకి ఎంటర్ అయ్యాక తమన్నా సింహాద్రి ఇష్టానుసారంగా వ్యవహరించడం హౌ సభ్యుల మధ్య అసభ్యంగా మాట్లాడటం తన దుస్తులతో మరియు తన చేష్టలతో జనాలకు తమన్నా సింహాద్రి వెటకారం గా ప్రవర్తించడం పై చాలామంది బిగ్బాస్ వీక్షకులు అసహనం చెందారు. దీంతో ఇటీవల జరిగిన ఎలిమినేషన్ ఈ కార్యక్రమంలో తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియాలో తమన్నా సింహాద్రి వెళ్లి పోవడం పై రకరకాల కామెంట్లు చేశారు. కొంతమంది అయితే హమ్మయ్య తమన్నా సింహాద్రి వెళ్ళిపోయింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గంట గంట కి నిమిష నిమిషానికి ప్రవర్తన మారిపోతే ఇలానే ఉంటుంది ఏం ప్లానింగ్ లేకుండా హౌస్ లో తనను తాను ప్రూఫ్ చేసుకుంటానని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇలానే ఉంటుందని కామెంట్లు చేశారు. మొత్తంమీద తమన్నా సింహాద్రి హౌస్ నుండి వెళ్లిపోవడం తో చాలామంది హమ్మయ్య తమన్నా సింహాద్రి వెళ్ళిపోయింది అంటూ చాలామంది బిగ్బాస్ వీక్షకులు ఫీలవుతున్నారు.
Top