బిగ్ బాస్ 3 మీద అప్పుడే జనాల్లో నెగెటివ్ ఫీలింగ్ ? రెండు అత్యంత బలమైన కారణాలు ఉన్నాయి మరి

Written By Aravind Peesapati | Updated: July 22, 2019 18:46 IST
బిగ్ బాస్ 3 మీద అప్పుడే జనాల్లో నెగెటివ్ ఫీలింగ్ ? రెండు అత్యంత బలమైన కారణాలు ఉన్నాయి మరి

బిగ్ బాస్ 3 మీద అప్పుడే జనాల్లో నెగెటివ్ ఫీలింగ్ ? రెండు అత్యంత బలమైన కారణాలు ఉన్నాయి మరి
 
తెలుగు రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ షో ఇప్పుడు మళ్ళీ మన ముందరకి వచ్చేసింది. మొదటి రెండు సీజన్ లూ సూపర్ హిట్ గా సాగిన ఈ షో గత సీజన్ మాత్రం కౌశల్ దయవల్ల కాంట్రవర్సీ ల నడుమ సాగింది. బిగ్ బాస్ 2 జరుగుతున్న సమయం లో కంటే బిగ్ బాస్ 2 ముగిసిన తరవాత ఎక్కువగా రచ్చ జరగడం మనం చూశాం. అయితే ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ మొదలైంది . ఎవరు గెలుస్తారు అనే విషయం సంగతి పక్కన పెడితే అసలు ఉన్న కంటెస్టంట్ లలో ఎంతమంది జనాలకి తెలుసు అనేది పెద్ద ప్రశ్న గా మారింది . దాదాపు అరవై శాతం మంది కొత్త మొఖాలే ఉండడం తో ప్రజలు ఈ మూడో సీజన్ ని ఎంతవరకూ హిట్ చేస్తారు అనేది అర్ధం కావడం లేదు. హేమ , శ్రీ ముఖి మినహా మిగితా ఎవ్వరూ ఫేమస్ జనాలు లేరు.
 
వరుణ్ అతని భార్య వితిక లని హౌస్ లోకి తీసుకోవడం వలన కాస్తంత నెగెటివ్ ఫీలింగ్ జనాలలో మొదలైంది. సామాన్య మద్యతరగతి జనాల లెక్క ప్రకారం ఈ షో లో 15 మంది వంద రోజుల పాటు ఇంటినీ తమ వాళ్ళనీ వదిలేసి ఉండాలి కానీ ఇక్కడ వరుణ్ సందేశ్ అతని భార్య ఇద్దరూ కలిసి హ్యాపీ గా హౌస్ లో ఉండడం తో ఇదెక్కడి న్యాయం అంటున్నారు సామాన్యులు. పైగా ఈ సారి కామనర్స్ ఒక్కరినీ కూడా తీసుకోకపోవడం చాలా దారుణం అంటూ కొందరు కోప్పడుతున్నారు.
Top