Bigg Boss Telugu S03 - బిగ్ బాస్ : ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న అనుష్క?
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం జరుగుతున్న గొడవలు క్షమాపణలు అలాగే బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న విధంగా షో మొత్తం రసవత్తరంగా మారడం..మరోపక్క వరుణ్ సందేశ్ జంటలు రొమాంటిక్ గా పక్కకు వచ్చి గేమ్ స్టాటజీ వేసుకొని ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తించడం ముఖ్యంగా వరుణ్ సందేశ్ భార్య వితిక చాలా దారుణంగా నిచంగా ప్రవర్తించడం పట్ల చాలా మంది బిగ్ బాస్ చూస్తున్న వీక్షకులు అలాగే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె ప్రవర్తన పై మండి పడుతున్నారు. Punarnavi తో గొడవ అలాగే మహేష్ తో గొడవ ఇలా వరుస వివాదాలు సృష్టిస్తూ... ఇంటి సభ్యుల చేత సానుభూతి తెలివిగా పొందుకుంటూ మరోపక్క అదిరిపోయే ప్లానింగ్ హస్బెండ్ వరుణ్ తో వేస్తూ వితిక ఆడుతున్న ఆట అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటువంటి క్రమంలో తాజాగా హౌస్ లోకి సెన్సేషనల్ హీరోయిన్ అనుష్క అడుగు పెట్టనున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 1 లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చి అలరించగా, సీజన్ 2 లో యాంకర్ ప్రదీప్, రానా వచ్చి బుల్లితెర ప్రేక్షకులను, బిగ్ బాస్ కాంటస్టెంట్లను ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ రూపంలో అనుష్క శెట్టి ని ఈ హౌస్ లోకి పంపించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.