Bigg Boss Telugu S03: Shocking News - బిగ్ బాస్ నుండి నేరుగా ఎలిమినేషన్ కి సెలెక్ట్ అయిన శ్రీముఖి..!

Written By Aravind Peesapati | Updated: August 09, 2019 10:54 IST
Bigg Boss Telugu S03: Shocking News - బిగ్ బాస్ నుండి నేరుగా ఎలిమినేషన్ కి సెలెక్ట్ అయిన శ్రీముఖి..!

Bigg Boss Telugu S03: Shocking News - బిగ్ బాస్ నుండి నేరుగా ఎలిమినేషన్ కి సెలెక్ట్ అయిన శ్రీముఖి..!
 
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య గొడవలకు దారి తీస్తున్నాయి. తాజాగా పోలీసు-దొంగ ఆటలో డబ్బు పెట్టాలని డబ్బులు తీయడానికి రవి తన చెయ్యి ఫ్రాక్చర్ చేసుకున్న గా ఇదే సమయంలో శ్రీముఖి డబ్బులతో అద్దాలు పగలగొట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే రవి చెయ్యి ఫ్రాక్చర్ కావడానికి శ్రీముఖి కారణమని ఇంటి సభ్యులు అంతా ఆమె టార్గెట్ చేసి రకరకాలుగా మాట్లాడటంతో ఇంటి సభ్యుల పై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో కన్ఫెషన్ రూమ్ కి రావాలని రవికృష్ణ కు బిగ్ బాస్ నుండి ఆర్డర్ రాగా రవి బిగ్ బాస్ కి సారీ చెప్పాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ శ్రీముఖి పై సీరియస్ అయ్యారు. దీంతో ఆమెను బిగ్ బాస్ నుండి వచ్చేవారం నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ చేశారు. ఆ తరువాత అలీ, పునర్నవిలకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సీక్రెట్ టాస్క్ లో సక్సెస్ అయితే తరువాతి వారం నామినేషన్ నుండి సేఫ్ అవుతారని బిగ్ బాస్ చెప్పారు.సీక్రెట్ టాస్క్ లో భాగంగా రాత్రి అందరూ పడుకున్నాక 1.30 గంటల సమయంలో ఎవరి కంట పడకుండా అలీ సీక్రెట్ రూంలోకి వెళ్లాడు. ఆ తరవాత ఉదయం 7.30కి ఎవరి కంట పడకుండా పునర్నవి సీక్రెట్ రూంలోకి వెళ్లింది. అలీ, పునర్నవి సీక్రెట్ రూమ్ నుండి బయటకి రావాలంటే హౌస్ మేట్స్ రెండు త్యాగాలను చేయాలని సూచించారు బిగ్ బాస్. దీంతో వారంతా చెప్పులు, పెరుగు అని చెప్పారు. ఆ తరువాత అలీ, పునర్నవి మళ్లీ ఇంట్లోకి రావాలని ఎంత మంది కోరుకుంటున్నారని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని అడిగారు. హిమజ, బాబా భాస్కర్ తప్ప మిగిలిన సభ్యులంతా అలీ, పునర్నవి మళ్లీ రావాలని కోరుకున్నారు. అయితే, ఎవరైతే వాళ్లిద్దరూ రావాలని కోరుకున్నారో వాళ్లు రెండు త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. ఇంట్లో చెప్పులు వేసుకోకూడదని, భోజనంలో పెరుగు ఉండదని తెలిపారు.
Top