Bigg Boss Telugu Season 3: తీన్మార్ సావిత్రి కథ విని బోరుమంటున్న బిగ్ బాస్ అభిమానులు మరియు ప్రేక్షకులు..!

Advertisement

by Aravind Peesapati | July 28, 2019 16:48 IST
Follow Xappie
Bigg Boss Telugu Season 3: తీన్మార్ సావిత్రి కథ విని బోరుమంటున్న బిగ్ బాస్ అభిమానులు మరియు ప్రేక్షకులు..!

తీన్మార్ సావిత్రి కథ విని బోరుమంటున్న బిగ్ బాస్ అభిమానులు మరియు ప్రేక్షకులు..!
 
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు ఏదో ఒక విధంగా షో లో హైలెట్ అవ్వడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కువ ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా నాగార్జున గారు ఇటీవల హౌస్ ఇంటి సభ్యులతో మాట్లాడిన సందర్భం తీన్మార్ సావిత్రి తన జీవితంలో చెప్పిన కథ ఇంటి సభ్యులతో పాటు బిగ్ బాస్ అభిమానులను మరియు టెలివిజన్ ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. సోషల్ మీడియాలో చాలామంది తీన్మార్ సావిత్రి కథ విని భర్తని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 19 ఏళ్లకే ఇంటినుంచి బయటకు వచేశానని శివజ్యోతి తెలిపింది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో అనేక సమస్యలు ఎదుర్కొన్నా. ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ కు వచ్చా. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోలేదు. మా అన్న హైదరాబాద్ లోనే ఉంటున్నా పట్టించుకోలేదు. తన భర్తే తనకు హాస్టల్ ఫీజు పంపించాడని తెలిపింది. ఎలాంటి ఉద్యోగం లేకుండానే నా భర్త నన్ను ఒకటిన్నర సంవత్సరం పోషించాడు. ఈ బాధలతో మా ఆయన పరీక్షలో తప్పాడు. ఇక నేను ఖాళీగా కూర్చుకుంటే చిన్న ఉద్యోగం చేయడం ప్రారంభించా. అటువంటి స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చానని తీవ్ర భావోద్వేగంతో చెప్పడంతో ఇంటి సభ్యులు అంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.


Advertisement


Advertisement

Top