Bigg Boss Telugu Season 3 - బిగ్ బాస్ : తమన్నా ఓవరాక్షన్ ! తరిమేయండంటున్న జనాలు
సీజన్ 3 బిగ్ బాస్ రియాల్టీ షో వీక్షకులను ఎంతగానో అలరిస్తుంది. రోజు రోజుకి ఆట రసవత్తరంగా మారుతోంది. రియాల్టీ షో లో మొట్టమొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సీనియర్ నటి హేమ. ఆమె ప్లేస్ లోకి వైల్డ్ కార్డు రూపంలో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇవ్వడం తో హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు అందరూ షాక్ తిన్నారు. ఇటువంటి నేపథ్యంలో హౌస్ లో ఉన్న సభ్యులు మాత్రమే కాక వీక్షకులు హౌస్ లో తమన్నా సింహాద్రి చేస్తున్న ఓవరాక్షన్ పై తీవ్రస్థాయిలో అసహనం చెందుతున్నట్లు సోషల్ మీడియాలో తెలుగు కామెంట్ వినబడుతున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ అనేదాన్ని ఉపయోగించుకుని తనని తాను డిఫెండ్ చేసుకుంటూ..మరో పక్క ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెడుతున్న తరుణంలో తమన్నా ఓవరాక్షన్ చేస్తుందని హౌస్ లో నుండి బయటకు తరిమేయండంటు బయట జనాలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా గురువారం ఎపిసోడ్‌లో ఆలీ రెజా ఒక టాస్క్‌లో మగవాళ్లతో ఆడవాళ్ల వేషాలేయించాడు. దానికి హర్ట్ అయిన తమన్నా అతడిని దారుణంగా తిట్టి పోసింది. నువ్వు ఎప్పటికీ స్టార్‌వి కాలేవు, కానివ్వను అంటూ హద్దులు దాటి తిట్టింది. అయినప్పటికీ ఆలీ మాత్రం సైలెంట్‌గానే అంతా భరించాడు. కానీ తమన్నా ఓవరాక్షన్ ప్రేక్షకులకి నచ్చలేదు. అసలు ఫ్యామిలీ షోలో ఇదేమి రచ్చ అంటూ బిగ్‌బాస్‌కి ట్వీట్లు పెడుతున్నారు. ఎలాగయినా ఆ తమన్నాని ఇంట్లోంచి పంపేయ్‌మని గోల చేస్తున్నారు.