Bigg Boss Telugu Season 3 Episode 16 Highlights: బిగ్ బాస్ హౌస్ లో కి వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి హౌస్ సభ్యులపై చాలా దారుణంగా అసభ్యంగా నోరు పారేసుకుంది. తాజాగా ఇటీవల జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ కార్యక్రమంలో తమన్నా సింహాద్రి వ్యవహరించిన తీరు పై బిగ్ బాస్ వీక్షకులు దారుణంగా విమర్శించారు. హౌస్ లోకి గేమ్ ఆడటానికి వచ్చిన ఇంటి సభ్యులపై తమన్నా సింహాద్రి ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని చాలా మంది నెటిజన్లు తమన్నా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ఎలిమినేషన్ నామినేషన్ కార్యక్రమంలో రెచ్చిపోయి దారుణంగా తమన్నా మాట్లాడటంతో ఇంటి సభ్యులు ఎంత వారించినా వినకుండా దారుణమైన కామెంట్ చేసింది తనని తాను కంట్రోల్ చేసుకోలేనట్టు రెచ్చిపోయింది. గత వారం అలీ రెజాపై ఇలాగే రెచ్చిపోయిన తమన్నా ఈసారి రవిని టార్గెట్ చేసింది. ఆమె సంగతి అలా వుంటే నటి పునర్నవి ఆవేశం కూడా కట్టలు తెంచుకుంది. ఓపెన్ అవడం లేదనే కారణం మీద తనని నామినేట్ చేస్తున్నారని ఆమె మండిపడింది. సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానంటూ బిగ్‌బాస్‌తోనే వాదానికి దిగింది. ఆమెతో నామినేషన్లు వేయించడానికి చాలా సమయం పట్టింది. మొత్తంమీద సోమవారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం మొత్తం రచ్చరచ్చగా మారింది.