Bigg Boss Telugu Season 3: బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరికి ఒక వార్నింగ్ ఇచ్చిన యాంకర్ నాగార్జున..!
బిగ్ బాస్ సీజన్ 3 లో ఇప్పటికే రెండు వారాల్లో గడిచిపోయాయి. ప్రస్తుతం మూడో వారం జరుగుతుంది. అంతేకాకుండా రెండు ఎలిమినేషన్ లు కూడా జరిగాయి. ఇటువంటి నేపథ్యంలో రెండోవారంలో ఇంటిలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు మరియు ఇంటిలో ఉన్న గ్రూపుల పై నాగార్జున ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల హౌస్ లో ముగిసిన దొంగతనం టాస్క్ లో అలీ రెజా, హిమజ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో తనని క్షమించమని హిమజ అలీ కాళ్లపై కూడా పడింది. ఈ విషయంలో నాగార్జున ఆలీకి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. అలీ.. నీ డ్రెస్ సెన్స్ బావుంది. కానీ కామన్ సెన్స్ లేదేంటయా నీకు.. ఆడపిల్లతో ప్రవర్తించేది అలాగేనా అంటూ నాగార్జున అలికి వార్నింగ్ గట్టిగా ఇచ్చారు నాగార్జున. మిగిలిన వారి పట్ల కూడా నాగార్జున తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ భార్య వితిక పోలీసు-దొంగ టాస్క్ లో భాగంగా కన్నింగ్ గా ఏడుస్తూ శ్రీముఖి ని టార్గెట్ చేసి రాహుల్తో ప్రవర్తించిన తీరుపై వితిక ని కడిగిపారేశారు. ఇదే క్రమంలో రాహుల్ కూడా శ్రీముఖి పై ఇష్టానుసారంగా మాట్లాడటం గురించి నాగార్జున ప్రస్తావిస్తూ రాహుల్ కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మొత్తం మీద శనివారం ఎపిసోడ్ మొత్తం నాగార్జున హౌస్ సభ్యుల కు వార్నింగ్ ఇస్తూ తనలోని యాంగ్రీ యాంగిల్ ని చూపించారు.