Bigg Boss Telugu Season 3: హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక బయటకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా సింహాద్రి..!

Advertisement

by Aravind Peesapati | August 13, 2019 14:15 IST
Follow Xappie
Bigg Boss Telugu Season 3: హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక బయటకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా సింహాద్రి..!

Bigg Boss Telugu Season 3: హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక బయటకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా సింహాద్రి..!

 
బిగ్ బాస్ హౌస్ నుండి మొట్టమొదటి ఇంటి సభ్యురాలిగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హేమ స్థానంలో వైల్డ్ కార్డు రూపంలో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇంటిలో రెండు వారాలపాటు తమన్నా సింహాద్రి తన ప్రయాణాన్ని కొనసాగించ గా ఇటీవల ఆదివారం తో తమన్నా సింహాద్రి ప్రయాణం ముగిసింది. దీంతో ఆదివారం జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ నుండి తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయింది. ఈ సందర్భంగా బయటకు వచ్చిన తమన్నా సింహాద్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోలో ఉన్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశానని తమన్నా తెలిపింది. తాను ఎలిమినేట్ కావడానికి కారణం ప్రజలు తనని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే అని తమన్నా తెలిపింది. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో. లోపలి ఎవరైనా గేమ్ ఆడేందుకే వెళతారు. రవి కృష్ణ విషయంలో తన ప్రవర్తన గేమ్ లో భాగమే అని తమన్నా తెలిపింది. కానీ అందరూ అది అర్థం చేసుకోకుండా నా క్యారెక్టర్ ని తప్పుబట్టారు. అది సరికాదు. గేమ్ లో అలా ప్రవర్తించినంత మాత్రాన నేను చెడ్డదాన్ని ఐపోతానా అని తమన్నా ప్రశ్నించింది.బిగ్ బాస్ హౌస్ లో నేను వెళ్లే సమయానికే కొన్ని గ్రూపులు ఉన్నాయి. వారంతా గ్రూపులుగా మారి నన్ను టార్గెట్ చేశారు అని తమన్నా పేర్కొంది. రవి, అలీ, రోహిణి ఒక గ్రూప్ అని తమన్నా పేర్కొంది. రవి కృష్ణని నేను తిట్టలేదు.. రెచ్చగొట్టాను అంతే. ప్రస్తుతం షోలో ఉన్నవారిలో శ్రీముఖి, బాబా భాస్కర్ అంటే తనకు ఇష్టం అని తమన్నా పేర్కొంది.


Advertisement


Advertisement

Top