Bigg Boss Telugu Season 3: రాఖి తో రాహుల్ ని భయపెట్టిన పునర్నవి..!
బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. నాలుగో వారంలో ఎంటరైన ఈ షో తాజాగా శనివారం జరగబోయే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయమై ప్రేక్షకుల్లో చాలా టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉండగా రాఖీ పండుగ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు అన్నా చెల్లెలు గా మారిపోయి ఒకరిపట్ల ఒకరు ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ కి హిమజ. రవికి రోహిణి రాఖీ కట్టగా.. మహేష్‌కి అషు.. అలీకి శివజ్యోతి రాఖీ కట్టి ఎమోషనల్ అయ్యారు.అయితే పునర్నవి ఎవరికి రాఖీ కడుతుందనగా.. అతనిలో మా తమ్ముడ్ని చూస్తున్నా అంటూ పునర్నవి రాహుల్ వైపు చూడటంతో.. రాహుల్ ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. కానీ ఇంతలో వరుణ్ సందేశ్ ని ఉద్దేశిస్తూ ఆ మాట అన్నట్లు పునర్నవి చెప్పడంతో రాహుల్ కూల్ అయ్యాడు. దీంతో హౌస్ లో వారంతా నవ్వేశారు. పునర్నవి.. వరుణ్ కి రాఖీ కట్టి తమ్ముడు అని పిలిచింది. హౌస్ లో ఉన్నవారందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఒక్క రాహుల్ కి తప్ప అంటూ అతడిని టీజ్ చేసింది పునర్నవి. ఆమె మాటలు విన్న మిగిలిన కంటెస్టంట్స్ అరుస్తూ రాహుల్ ని ఏడిపించారు.