మహర్షి కలక్షన్ ల పరిస్తితి ఏంటి ?

మహర్షి కలక్షన్ ల పరిస్తితి ఏంటి ?

మహర్షి కలక్షన్ ల పరిస్తితి ఏంటి ?
 
మహేష్ బాబు తాజాగా నటించిన ‘మహర్షి’ సినిమా సమ్మర్ కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మరోపక్క తమ అభిమాన నటుడు మహేష్ కెరీర్లో 25వ సినిమా అయిన నేపథ్యంలో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి క్రమంలో ‘మహర్షి’ కలెక్షన్ల గురించి వింటుంటే అందరు ఆశ్చర్యపడుతున్నారు. మరోపక్క ఓవర్సీస్ లో భారీ మార్కెట్ ఉండే మహేష్ బాబు కి ‘మహర్షి’ సినిమా ద్వారా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం ఇప్పుడు అందరికీ షాక్ కి గురి చేసింది. ఓవరాల్ గా సినిమాకు ఓవర్సీస్ లోనష్టాలు వచ్చాయని సమాచారం.
 
అమెరికా.. నాన్ అమెరికా అన్ని ఏరియాలకు కలిపి ఓవర్సీస్ రైట్స్ ను 11.5 కోట్లకు అమ్మారట. ఇప్పటివరకూ ఓవర్సీస్ లో $1.88 మిలియన్ మాత్రమే వసూలు చేసింది. అంటే రూ. 9.55 కోట్లు మాత్రమే రికవర్ చేసింది. ఈ లెక్కన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు దాదాపుగా ఒకటిన్నర కోటి కంటే ఎక్కువగా నష్టం వచ్చినట్ట లెక్క. లాభనష్టాల సంగతి పక్కన పెడితే 'మహర్షి' మహేష్ కెరీర్ లో ఓవర్సీస్ లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో 'భరత్ అనే నేను'.. 'శ్రీమంతుడు' రెండవ స్థానంలో ఉంది. మొత్తంమీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల విషయంలో దుమ్ముదులిపిన మహేష్ మహర్షి ఓవర్సీస్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం మహేష్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.Top