విజయ్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యాడు ?

Written By Siddhu Manchikanti | Updated: July 08, 2019 10:56 IST
విజయ్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యాడు ?

విజయ్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యాడు ?
 
టాలీవుడ్ టాప్ హీరో విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించిన ఫంక్షన్లకు హాజరైతే అద్భుతంగా ప్రేక్షకులను అభిమానులను అలరించే విధంగా మాట్లాడుతారు. తన మనసులో మరియు మైండ్ లో ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్పేస్తాడు. అటువంటిది విజయ్ దేవరకొండ ఓ సినిమా ఫంక్షన్లో చాలా ఎమోషనల్ అయ్యాడు. విషయంలోకి వెళితే విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ మొట్టమొదటిసారి నటించిన దొరసాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి విజయ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విజయ్ చాలా భావోద్వేగంగా తన తమ్ముడి గురించి ఫంక్షన్లో తెలియజేశాడు. తన తమ్ముడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, తన కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాడో? తను నటుడు కావడానికి అవసరమైన సాయం ఏ విధంగా చేసాడో కొద్ది మాటల్లోనే అన్యాపదేశంగా చెప్పాడు. అలాంటిది అమెరికాలో ఉద్యోగం వదిలి వస్తానంటే తనకు నచ్చలేదని చెప్పాడు.
 
అలాగే నటుడు అవుతాను అని చెప్పినా తనకు నచ్చలేదని చెప్పాడు. తనంతట తానే సినిమా చేసుకోమని, స్క్రిప్ట్ చూసుకోమని, పాట్లు అన్నీ పడమనీ వదిలేసానని, సినిమా లోకంలో ఓ సినిమా చేయడం అంటే ఎంత కష్టమో తెలియాలని, అవమానాలు, ట్రొలింగ్ లు భరించే శక్తి రావాలని, అన్ని విధాలా రాటు దేలాలని అలా చేసానని చెప్పాడు. ఇవన్నీ తను బలవంతంగా చేసానని, పాటలు బాగున్నా చెప్పలేదు, షేర్ చేయలేదు, టీజర్, ట్రయిలర్ బాగున్నా మాట్లాడలేదు, ఎవరు అడిగాన నాకేం తెలియదనే చెప్పా, అన్నీ అలా అణచుకున్నా అంటూ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసాడు విజయ్. అంతేకాకుండా ముందు సినిమా చూసిన తర్వాతే ప్రి రిలీజ్ ఫంక్షన్ కు వస్తానని లేకపోతే మరొకర్ని చూసుకోవాల్సి ఉంటుంది అని ముందే చెప్పానని..దీంతో సినిమా చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది అందరూ కలిసి చాలా మంచి సినిమా చేశారు అంటూ విజయ పేర్కొన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే సినిమా అద్భుతమని చెబుతారని విజయ్ చెప్పుకొచ్చాడు.
Top