మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొడతా అని అన్నా మోడీకి భయంకరమైన కౌంటర్ వేసిన చంద్రబాబు..?

Written By Siddhu Manchikanti | Updated: April 30, 2019 13:54 IST
మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొడతా అని అన్నా మోడీకి భయంకరమైన కౌంటర్ వేసిన చంద్రబాబు..?

మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొడతా అని అన్నా మోడీకి భయంకరమైన కౌంటర్ వేసిన చంద్రబాబు..?
 
ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోడీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కీలక అడుగులు వేస్తున్న చంద్రబాబు.. ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు అని... మమతా ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నట్టుగా... మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో కౌంటర్లు వేశారు చంద్రబాబు. మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని అభిప్రాయపడ్డారు.
 
ట్విట్టర్ వేదికగా మోదీ వ్యాఖ్యలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. తాను తల్చుకుంటే మమత ప్రభుత్వాన్ని కూల్చగలనంటూ మోదీ అనడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఈసీ స్పందించాలని డిమాండ్ చేశారు. మోదీపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసిన మోదీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Top