గ్యారెంటీగా వైయస్ జగన్ సీఎం అంటున్న ఏపీ మాజీ టీడీపీ ఎంపీ..!

Written By Siddhu Manchikanti | Updated: April 30, 2019 13:59 IST
గ్యారెంటీగా వైయస్ జగన్ సీఎం అంటున్న ఏపీ మాజీ టీడీపీ ఎంపీ..!

గ్యారెంటీగా వైయస్ జగన్ సీఎం అంటున్న ఏపీ మాజీ టీడీపీ ఎంపీ..!
 
ఏపీ లో మొదటి దశలో ఎన్నికలు జరిగినా నేపథ్యంలో ఫలితాల కోసం ప్రధాన పార్టీల నాయకులు చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. అయితే జరిగిన ఎన్నికల విషయమై విజయం తమదంటే తమదని ప్రధాన పార్టీల నాయకులు మీడియా ముందు తెగ ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం ఎవరన్నదానిపై టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తేల్చేశారు. ఏపీలో ఈసారి గ్యారెంటీగా వైయస్ జగన్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఏపీకి మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
 
రాజన్న రాజ్యం రావాలంటే అది వైఎస్ జగన్ తోనే సాధ్యమంటున్నారు. తెలుగుభాష బాగుపడాలంటే జగన్ అధికారంలోకి రావాలని యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేకర్ రెడ్డి హయాంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కితే ఆ భాషను తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగు వెలుగు సాధ్యపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ మంచి పాలన అందిస్తారని కూడా యార్లగడ్డ ఆశాభావం వ్యక్తం చేశారు.
Top