జగన్ కి సలాం కొట్టిన రాంగోపాల్ వర్మ..?

Written By Siddhu Manchikanti | Updated: April 30, 2019 14:02 IST
జగన్ కి సలాం కొట్టిన రాంగోపాల్ వర్మ..?

జగన్ కి సలాం కొట్టిన రాంగోపాల్ వర్మ..?
 
ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి విజయవాడ నగరంలో మీడియా సమావేశం నిర్వహిస్తామని ప్రకటన చేసి గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ అధినేత జగన్ ఈ విషయం తెలుసుకున్న ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే నష్టం ఏం జరిగిందని...ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని.. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని.. ఇదేనా ప్రజాస్వామ్యం.. చంద్రబాబు గారూ.. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి అని నిలదీయడం పై సోషల్ మీడియాలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది.
 
ఈ క్రమంలో చాలా మంది జగన్ రామ్ గోపాల్ వర్మ కి అండగా నిలవడంపై వివిధ రకాలుగా కామెంట్లు చేసిన ..చాలా మంది నెటిజన్లు పాజిటివ్గా స్పందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా జగన్ తనకు మద్దతు తెలిపిన దాని విషయమై ట్విట్టర్లో స్పందించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏ పార్టీకి చెంద‌న వార‌నేది అన‌వ‌సం. ప్ర‌జాస్వామ్యంలో భంగం క‌లిగిన‌ప్పుడు ఓ వ్య‌క్తిగా స్పందించడం మంచి ప‌రిణామ‌మ‌ని.. ఆర్జీవీ అన్నారు.
Top