విజయసాయి రెడ్డి కి పిచ్చి పట్టింది..?

Written By Siddhu Manchikanti | Updated: April 30, 2019 14:06 IST
విజయసాయి రెడ్డి కి పిచ్చి పట్టింది..?

విజయసాయి రెడ్డి కి పిచ్చి పట్టింది..?
 
ఏపీ ఉప ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబ రావు వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు విజయసాయి రెడ్డి కుటుంబరావు గురించి మీడియా ముందు అనేక కామెంట్లు చేసిన క్రమంలో తాజాగా కుటుంబరావు ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో తాను ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించకూడదని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
 
తాజాగా ఇటీవల ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కుటుంబరావు వైసీపీ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజ‌య‌సాయిరెడ్డి పిచ్చిప‌ట్టిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని కుటుంబ‌రావు విమ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల అవ‌స‌రాల మేర‌కే అప్పులు చేయ‌డం జ‌రిగింద‌ని, ఏపీ ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి అన్ని వివ‌రాలు స‌మ‌ర్పించామ‌ని, ఆ ప‌త్రాల‌ను చూస్తే రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక వ్య‌వ‌హారాలు అర్ధ‌మ‌వుతాయ‌న్నారు. ఆర్థిక సంవ‌త్స‌రానికి తాము స‌మ‌ర్పించిన ప‌త్రాలు లేవంటే గ‌నుకు వాటిని వైసీపీ నేత‌ల‌కు అందిస్తామ‌ని, వాటిని చ‌దివి అర్ధం చేసుకుంటార‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని వెటకారం ఐన కామెంట్లు చేశారు.
Top