నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత..!

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత..!

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత..!
 
నంద్యాల ఎంపీ నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీవై.రెడ్డి హైదరాబాదు నగరంలో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గుండె కిడ్నీ సంబంధమైన సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి నంద్యాల పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు.
 
ప్రచారం సమయంలోనే ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆ సమయంలోనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న ఎస్పీవై రెడ్డి తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఎస్పీవై రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఆ తర్వాత 2019 ఎన్నికలు జరగక ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. చివరిగా జనసేన పార్టీ తరఫున నంద్యాల ఎంపీ స్థానానికి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా ఎస్పీవై రెడ్డి మరణించడంతో కర్నూలు జిల్లా లో విషాద ఛాయలు అలముకున్నాయి.Top