న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాద్ చాలా ఉత్తమం..!

న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాద్ చాలా ఉత్తమం..!

న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాద్ చాలా ఉత్తమం..!
 
హైదరాబాద్ నగర పోలీస్ కమషనర్ అంజనీకుమార్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. న్యూయార్కు నగరం, హైదరాబాద్ నగరం జనాభా రెండూ దాదాపు సమానమే అయినా, న్యూయార్కు కన్నా హైదరాబాద్ ఎంతో సురక్షతంగా ఉందని ఆయన వివరించారు. ఒక సమావేశంలో ఆయన ఈ వివరాలు చెప్పారు. హైదరాబాద్ లో ఎనభైఆరు లక్షల మంది జనాభా ఉంటే, న్యూయార్కులో 89 లక్షల జనాబా ఉందని ఆయన చెప్పారు. ఇక్కడ 66 పోలీస్ స్టేషన్లు ఉంటే, అక్కడ డెబ్బై ఐదు పోలీస్ స్టేషన్ లు ఉన్నాయని తెలిపారు.
 
హైదరాబాద్ లో కన్నా, న్యూయార్కులో ఐదు రెట్లు అదికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తుపాకిలను వాడి నేరాలకు పాల్పడడం అయితే ఇక్కడ కన్నా 200 రెట్లు అదికంగా అక్కడ జరుగుతున్నాయి. మహిళలపై న్యూయార్కులో ఇక్కడ కన్నా పది రెట్లు అదికంగా జరుగుతున్నాయి. న్యూయార్కులో కన్నా ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం వాడకం ద్వారా నేరాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నామని చెబుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలలోగతంలో ఏడాదికి పదహారు హత్యలు జరిగితే, సిసిటీవీలు వంటి వాటిని అమర్చడం ద్వారా అరవైఐదు శాతం నేరాలు తగ్గాయని అంజనీకుమార్ చెప్పారు.Top